ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరీక్ష రాయాలంటే గ్లౌజులు, మాస్కులు తప్పనిసరి - విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇకపై ముఖానికి మాస్కు.. చేతులకు గ్లౌజులు ధరించి వస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

Gloves and masks are mandatory for exams
పరీక్ష రాయాలంటే గ్లౌజులు, మాస్కులు తప్పనిసరి

By

Published : May 25, 2020, 3:08 PM IST

చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కు ధరిస్తేనే పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. జాతీయస్థాయిలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై ఎయిమ్స్‌ నిపుణులు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించే టీసీఎస్‌ అయాన్‌ సంస్థ ప్రతినిధులతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంబంధిత మార్గదర్శకాల పై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చర్చించారు. మాస్కుతోపాటు చేతులకు రబ్బర్‌ గ్లౌజులు ధరించి రావడం తప్పనిసరి అని ఛైర్మన్‌ పాపిరెడ్డి చెప్పారు. వాటిని విద్యార్థులే తెచ్చుకోవాలని తెలిపారు. చిన్న శానిటైజర్‌ బాటిల్‌, తాగునీటి సీసాను సైతం ఎంసెట్‌తో పాటు ఇతర అన్ని ఆన్‌లైన్‌ పరీక్షలకు అనుమతిస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details