ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా.. మంత్రుల నివాసాలు ముట్టడికి యత్నం

students protest
students protest

By

Published : Jun 28, 2021, 11:16 AM IST

Updated : Jun 28, 2021, 1:41 PM IST

13:36 June 28

జాబ్‌ క్యాలెండర్‌పై నిరసన

జాబ్‌ క్యాలెండర్‌పై నిరసన

ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారని ఆరోపించారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలతో కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం ఆధ్వర్యంలో నేతలు యత్నించారు. కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, తిరుపతిలోమంత్రి పెద్దిరెడ్డి, విజయనగరంలో మంత్రి బొత్స, విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఇళ్లను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరులో ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు.

11:44 June 28

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు అనిల్‌, బుగ్గన

కర్నూలు: ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

కర్నూలు: కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌

11:43 June 28

విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స ఇంటిని ముట్టడి యత్నం

విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స ఇంటిని ముట్టడి యత్నం

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స ఇంటిని ముట్టడికి వెళ్లిన యువకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తక్షణం కొత్త జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు..

11:24 June 28

ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నేతల యత్నం

విజయవాడ: ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నేతల యత్నం

ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ ఆందోళన

విజయవాడ: ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ముట్టడికి యత్నించిన నేతల అరెస్టు, సూర్యారావుపేట పీఎస్‌కు తరలింపు

11:24 June 28

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి నివాసం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

తిరుపతి: కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు, ఎస్వీ వర్సిటీ పీఎస్‌కు తరలింపు

11:23 June 28

కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా క్యారాలయం ఎదుట ధర్నా

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా

కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా క్యారాలయం ఎదుట ధర్నా

కడప: ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌

11:11 June 28

మంత్రి బొత్స నివాసం ముట్టడికి యత్నం

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా

విజయనగరం: మంత్రి బొత్స నివాసం ముట్టడికి యత్నం

బొత్స నివాసం ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు

విద్యార్థి సంఘ నాయకులను అరెస్టుచేసిన పోలీసులు

విజయనగరం: ఉద్యోగాల ఖాళీలు భర్తీచేయాలని డిమాండ్‌

11:11 June 28

యువజన, విద్యార్థి సంఘాల చలో కలెక్టరేట్‌ పిలుపు

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా

గుంటూరు: యువజన, విద్యార్థి సంఘాల చలో కలెక్టరేట్‌ పిలుపు

గుంటూరు: ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌

విద్యార్థి, యువజన నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు

11:10 June 28

మంత్రి ముత్తంశెట్టి ఇంటి వద్ద నిరుద్యోగుల ఆందోళన

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా

విశాఖ: మంత్రి ముత్తంశెట్టి ఇంటి వద్ద నిరుద్యోగుల ఆందోళన

విశాఖ: ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌

విశాఖ: ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

10:37 June 28

live page

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ గుంటూరు జిల్లాలో యువజన సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధించారు. వామపక్ష అనుబంధ సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై భైఠాయించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Last Updated : Jun 28, 2021, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details