తెలంగాణ పోలీసుకు జై.. ప్రజల హర్షాతిరేకాలు.. - students praised telangana police
సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌కౌంటర్ విషయం తెలిసిన కళాశాల విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా.. పోలీసులను చూసి... పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలుత పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడిన వారే ఇప్పుడు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్లో విద్యార్థినులు కళాశాలకు వెళ్తుండగా... ఎన్‌కౌంటర్ విషయం తెలిసి... ‘జై పోలీస్! జై జై పోలీస్!!’ అంటూ నినదించారు. నేరస్థులకు ఎన్‌కౌంటర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీసు అధికారులు తెలంగాణలో ఉన్నందుకు గర్వంగా ఉందంటూ మరికొంత మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.