ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేఈఈ మెయిన్​లో తెలుగు సత్తా - JEE Main news

జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మందికి  100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించగా...వారిలో తెలుగు విద్యార్థులే 11 మంది ఉండటం విశేషం.

students-from-telugu-states-competed-in-jee-main
జేఈఈ మెయిన్​లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల

By

Published : Sep 12, 2020, 6:51 AM IST

జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి మెరుపులు మెరిపించారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించగా వారిలో తెలుగు విద్యార్థులే 11 మంది ఉండటం విశేషం. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు ఎనిమిది మంది సంపూర్ణ పర్సంటైల్‌ పొంది సత్తా నిరూపించారు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత టాపర్ల జాబితాను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ర్యాంకులను మాత్రం రాత్రి 11.45 గంటల వరకు ప్రకటించలేదు. ఈనెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 2.50 లక్షలమందికి అవకాశం కల్పిస్తారు.

గత ఏడాది కంటే ఆలస్యం..

పోయిన సంవత్సరం రాత్రి 9 గంటలకు మెయిన్‌ ర్యాంకులను ప్రకటించిన ఎన్‌టీఏ ఈసారి ఇంకా ఆలస్యంగా వెల్లడించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలకు గడువు ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
వాటిని పరిశీలించి.. తుది కీ ఖరారు చేసి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ర్యాంకులు కేటాయించేందుకు ఎన్‌టీఏ అధికారులు రోజంతా కసరత్తు చేసి చివరకు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు తుది కీ విడుదల చేసింది. రాత్రి 11 గంటల తర్వాత 100 పర్సంటైల్‌ సాధించిన వారి జాబితా వెల్లడించారు.

24 మందిలో మనోళ్లు 11 మంది

24 మందికి 100 పర్సంటైల్‌ సాధించగా వారిలో 11 మంది తెలుగు విద్యార్థులే. అందులో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది, ఏపీ విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.

తెలంగాణ నుంచి

1. చాగరి కౌశల్‌ కుమార్‌రెడ్డి 2. చుక్కా తనూజ 3.. దీప్తి యశశ్చంద్ర 4. ఎం.లిఖిత్‌రెడ్డి 5.రాచపల్లి శశాంక్‌ అనిరుధ్‌ 6. ఆర్‌.అరుణ్‌ సిద్ధార్థ్‌ 7. సాగి శివకృష్ణ 8. వాడపల్లి అర్వింద్‌ నరసింహా

ఏపీ విద్యార్థులు

1. లండా జితేంద్ర 2. తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్‌ 3. వైఎస్‌ఎస్‌ నరసింహనాయుడు

నేడు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ శనివారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందని ఆర్గనైజింగ్‌ ఛైర్మన్‌ ఆచార్య సిద్ధార్థ పాండే ‘ఈనాడు’కు తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధించిన 2.50 లక్షలమంది ఈనెల 12-17 తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వారికి ఈనెల 27న ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబరు 5న ర్యాంకులు విడుదల చేస్తారు.

అమ్మాయిల్లో టాపర్లు

ఏపీ: రెడ్డి భావన (99.9924070)

తెలంగాణ: చుక్కా తనూజ (100)

ఇదీ చదవండి:'అప్పడు విదేశీ విద్య.. ఇప్పుడు స్వదేశీ శిరోముండనం'

ABOUT THE AUTHOR

...view details