భారత గ్రామీణ ఆర్థికవ్యవస్థకు కీలకమైన వ్యవసాయరంగానికి యువత క్రమంగా దూరమవుతున్నారు. సాగును చిన్నచూపుగా భావించి పట్నం వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా తెచ్చిన మార్పులతో సాగు రంగ ముఖచిత్రం మారుతోంది. వ్యవసాయమే దిక్కు అనే పరిస్థితులు రాబోతున్నాయని సాగు పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వేళ విద్యాసంస్థలు తెరుచుకోకపోవడం వల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చిన్నారులు ఉత్సాహంగా పొలం బాట పడుతున్నారు. ఇంటి పెద్దలు, కూలీలతో కలిసి ఆడుతూ పాడుతూ వరినాట్లు వేస్తున్నారు. పొలం పనులు నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు.
పొలం'బడి'
నీటి లభ్యత ఉన్నచోట వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో పొలాల్లో స్వయంగా పనులుచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు. పొలం పనుల్లో మెళకవలు, సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు సాయపడాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు.
వ్యవసాయంతోనే భవిష్యత్తు