Student suicide attempt at OU: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సురేశ్ అనే విద్యార్థి.. పెట్రోల్ సీసాతో హల్చల్ సృష్టించాడు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బలవన్మరణానికి ప్రయత్నించాడు. నోటిఫికేషన్లు ఇచ్చాకే తెరాస నేతలు ఓయూకు రావాలని అన్నాడు.
Student suicide attempt at OU: ఓయూలో పెట్రోల్ సీసాతో విద్యార్థి హల్చల్ - OU student demands job notifications
తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్రోల్ సీసాతో ఓ విద్యార్థి హల్చల్ చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బలవన్మరణానికి ప్రయత్నించాడు. నోటిఫికేషన్లు ఇచ్చాకే తెరాస నేతలు ఓయూకు రావాలని అన్నాడు.
![Student suicide attempt at OU: ఓయూలో పెట్రోల్ సీసాతో విద్యార్థి హల్చల్ Student suicide attempt at OU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14308244-54-14308244-1643376420244.jpg)
Student suicide attempt at Osmania University: ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఓయూలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీని ప్రారంభించడానికి తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఓయూకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో.. ఓయూ విద్యార్థులు వర్సిటీలో ఏర్పాటు చేసిన తెరాస నేతల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతే తెరాస నేతలు ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా వర్సిటీలో అడుగుపెడితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!