గ్రామీణ ప్రాంతాల్లో వీధి స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పేరును ప్రభుత్వం మార్చింది. ఈ ప్రాజెక్టును "జగనన్న పల్లె వెలుగు" గా మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు.
'జగనన్న పల్లె వెలుగు' గా స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు - స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌శాఖ చేపట్టిన ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరును ప్రభుత్వం మార్చింది. ఈ ప్రాజెక్టుకు జగన్న పల్లె వెలుగుగా మార్చాలని ఆదేశాలు జారీచేసింది.
జగనన్న పల్లె వెలుగుగా స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు
ఈ మేరకు చర్యలు చేపట్టాలని కమిషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ ప్రతిపాదన మేరకు ప్రాజెక్టు పేరు మార్పు చేసినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి :జూ.న్యాయవాదులకు తీపి కబురు.. 'వైఎస్ఆర్ లా నేస్తం' నిధులు విడుదల