వీధి కుక్కలు మనుషులనే కాదు.. తోటి మూగ జీవాలను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.
మాజీ సర్పంచ్ ముజాఫర్కు చెందిన దొడ్డిపై రాత్రి దాడి చేసి 27 మేకలను హతమార్చాయి. ఒకేసారి అన్ని మేకలు చనిపోవడంపై యజమానితోపాటు అతని కుటుంబీకులు ఆవేదన చెందారు.