పశుసంవర్ధక శాఖలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద చేపట్టే వివిధ పథకాలకు పరిపాలనా ఆమోదం ఇస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొన్ని కొత్త పథకాలు ఉండగా.. మరికొన్ని ప్రస్తుతం కొనసాగుతున్న వాటికే అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. 50 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూర్చేలా రూ.15.40కోట్లతో దాణా, మేత అందించనున్నారు. దీనిలో భాగంగా దాణా, పచ్చిమేత, ఎండుగడ్డి, గడ్డి కోత యంత్రాలు, మిక్సింగ్ యూనిట్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా గడ్డి, దాణా యంత్రాలు - feeding machines to farmers news
రైతు భరోసా కేంద్రాల ద్వారా పశువుల దాణా, గడ్డికోత యంత్రాలు అందించనున్నారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
రైతు భరోసా కేంద్రం