Stranger Phone Call to Home Minister: హైదరాబాద్ పాతబస్తీలో హోటళ్లు ఎప్పటి వరకూ తెరిచి ఉంచాలనే దానిపై ఓ అపరిచిత వ్యక్తి అర్ధరాత్రి హోంమంత్రికి చేసిన ఫోన్ కాల్ సంభాషణ కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పాతబస్తీలో హోటళ్లను రాత్రి 11 లేదా 12 వరకు తెరిచేలా చూడాలని ఆ వ్యక్తి హోంమంత్రికి ఫోన్ కాల్లో విజ్ఞప్తి చేశాడు. సామాజిక మాధ్యమాల్లో హోటళ్లు రాత్రి ఒంటి గంట వరకు ఓపెన్ చేసి ఉంటాయనే వార్త వైరల్ అవుతోందని హోంమంత్రికి తెలిపాడు.
అర్ధరాత్రి తెలంగాణ హోంమంత్రికి అపరిచిత వ్యక్తి ఫోన్.. ఎందుకో తెలిస్తే షాక్ - పాతబస్తీ తాజా వార్తలు
Stranger Phone Call to Home Minister: అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఓ అపరిచిత వ్యక్తి ఫోను చేశాడు. పాతబస్తీలో హోటళ్లు రాత్రి 11 లేదా 12 వరకు తెరిచేలా చూడాలని చరవాణి సంభాషణలో కోరాడు. సామాజిక మాధ్యమాల్లో హోటళ్ల సమయపాలన గురించి వైరల్ అవుతుందని సదరు వ్యక్తి మంత్రికి తెలిపాడు. దీనికి ప్రతిగా హోంమంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
సదరు వ్యక్తి ఫోన్ కాల్కు స్పందించిన హోంమంత్రి ఈ విధంగా వివరణ ఇచ్చారు. అధికార యంత్రాంగం నిర్ణయించిన సమయ వేళల ప్రకారమే దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉంటాయని మంత్రి సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి నిద్రించే వరకు ఆయా పనులలో నిమగ్నమై ఉంటామని.. రాత్రి వేళల్లో ఫోను చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి సమయంలో ఫోన్ చేసి ఇలాంటి విషయాలు అడగడం సబబు కాదని మంత్రి సదరు వ్యక్తికి చెప్పారు. చివరగా ఆ వ్యక్తి అర్ధరాత్రి 1 వరకు అంటే ఇబ్బందులు ఎదురవుతాయంటే.. కనీసం రాత్రి 11 గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచేలా అనుమతులు ఇవ్వాలని ఫోన్ చేసిన వ్యక్తి హోంమంత్రిని కోరాడు.
ఇవీ చదవండి: