చెన్నైకి సమీపంలోని అనకాపుత్తూరు... చేనేతకు పెట్టింది పేరు. అక్కడ కార్మికుల్లో అత్యధికులు తెలుగువారు. కాలక్రమేణ చేనేతకు ఆదరణ లేక మగ్గాల సంఖ్య బాగా తగ్గింది. అందుకే వైవిధ్యంగా ప్రయత్నించాడు ఆ పల్లెవాసి శేఖర్. నార వస్త్రాలు నెయ్యాలని సంకల్పించారు.
నార వస్త్రాలంటే అరటి, జనుము, గోంగూర, కలబంద, వెదురు వంటి మొక్కల నుంచి నార వేరు చేసి నేసిన బట్టలు. వాటికి ఆధునిక హంగులు జోడించి తయారు చేయడం శేఖర్ ప్రత్యేకత. పట్టు, నార కలిపి నార పట్టు వస్త్రాలు సైతం తయారు చేశారు.
అరటి నారతో ప్రారంభించి... 25 రకాల నారలతో వస్త్రాలు తయారు చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ స్థానం సంపాదించారు. 50 రకాల నారలతో వస్త్రాలు నేసి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించడం లక్ష్యంతో సాగుతున్నాడీ శేఖర్.