ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని మహిళలపై రాళ్లదాడి - Uddandarayunipalem Latest news

రాజధాని మహిళలపై బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానుల కోసం దీక్ష చేస్తున్న వారు రాళ్ల దాడి చేశారు. ఉద్దండరాయునిపాలెం శిబిరంలోని మహిళలపై దాడికి పాల్పడటంతోపాటు అక్కడ ఉన్న అమరావతి ఐకాస జెండాలు, ఫ్లెక్సీలు తీసి రోడ్డుపైకి విసిరేశారు. మహిళల్ని అసభ్యపదజాలంతో దూషించారు. ఒక్క రాజధాని వద్దు..మూడు రాజధానులు ముద్దు అని నినదించారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు, మూడు రాజధానుల శిబిరంవారు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో ఇద్దరు అమరావతి ఉద్యమ మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.

Stone pelting on initiation camp at Uddandarayunipalem
ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరంపై రాళ్లదాడి

By

Published : Dec 6, 2020, 6:17 PM IST

Updated : Dec 7, 2020, 4:47 AM IST

పోలీసులను ఛేదించుకుని..
‘ఇంటింటికి అమరావతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజధాని మహిళలు ఆదివారం ఉద్దండరాయునిపాలెంలో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టి పెట్టి ఉద్యమ ఆవశ్యకతను తెలుపుతున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ ఇంటి సమీపంలో కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి శిబిరానికి చేరుకున్నారు. అంతలో ఎంపీ ఇంటి వైపు రాజధాని రైతులు వస్తున్నారన్న సమాచారంతో మందడం సమీపంలో దీక్షలు చేస్తున్న మూడు రాజధానుల శిబిరం వారు ఆటోల్లో ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. నినాదాలు చేస్తూ గ్రామంలోని అమరావతి రైతుల దీక్షా శిబిరం వైపు వచ్చారు. బొడ్డు రాయి సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకోగా వారిని ఛేదించుకుని రైతులున్న శిబిరం వద్దకు వచ్చారు. అక్కడున్న రాళ్లు తీసుకుని మహిళలపై దాడి చేశారు.

అనంతరం కాసేపు ఇరువర్గాల ఆందోళన తర్వాత పోలీసులు మూడు రాజధానుల శిబిరం వారిని అక్కడి నుంచి పంపించేశారు. దాడి విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్దండరాయునిపాలెం చేరుకొని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తుళ్లూరు వెళ్లి రహదారిపై భైఠాయించారు. అర్ధరాత్రి వరకూ కూడా ఆందోళన కొనసాగిస్తూ రోడ్డుపైనే నిద్రించారు. ఉద్రిక్తత నేపథ్యంలో తుళ్లూరుకు ప్రత్యేక బలగాలు తరలాయి. మరోవైపు మిగిలిన గ్రామాల్లో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 355వ రోజు ఆదివారమూ నిరసనలు కొనసాగాయి.

ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరంపై రాళ్లదాడి

దాడుల్ని నిరోధించాలంటూ ఎంపీ సురేశ్‌కు దళితుల వినతి

గ్రవర్ణాలు చేస్తున్న దాడులను తక్షణం నిరోధించాలంటూ దళిత సంఘాల నాయకులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌కు ఆదివారం వినతిపత్రం అందించారు. దళితులపై ప్రతిసారీ దాడులుచేస్తూ భయపెడుతున్నారని, వారిని తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. రాజధాని అమరావతి రైతుల ముసుగులో తెదేపా నాయకులు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై మరోసారి దాడిచేసేందుకు యత్నించారంటూ దళిత సంఘాల నాయకులు విమర్శించారు.

పెట్రోలు పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

తుళ్లూరు ధర్నాలో అదే గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశ్వరరావు అనే రైతు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న రైతులు వారించి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. తనకు ఉన్న ఎకరం పొలం ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పుడు రోడ్డుపై పోరాటం చేయాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో తీర్మానం రాజ్యాంగ విరుద్ధం'

Last Updated : Dec 7, 2020, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details