ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి - పరకాల ఎమ్యెల్యే ఇంటిపై రాళ్ల దాడి

తెలంగాణలో ఓ ఎమ్మెల్యే ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయం చేస్తోందంటూ.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానిని తీవ్రంగా పరిగణించిన ఆ పార్టీ శ్రేణులు.. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని ఆయన ఇంటివద్ద దాడికి దిగారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆందోళనకారులను అదుపుచేశారు.

bjp men attack on telangana mla house at hanmakonda
పరకాల ఎమ్మెల్యే ఇంటిపై భాజపా శ్రేణుల దాడి

By

Published : Jan 31, 2021, 8:01 PM IST

పరకాల ఎమ్మెల్యే ఇంటిపై భాజపా శ్రేణుల దాడి

తెలంగాణలోని వరంగల్​ రూరల్​ జిల్లా హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు రాళ్లు, కుర్చీలు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంట్లోని పూలకుండీలు, అద్దాలు ధ్వంసం చేశారు. రామమందిరం నిధుల సేకరణపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇంటి ముందు బైఠాయించి.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ధర్మారెడ్డి ఏమన్నారు...

శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయం చేస్తోందని.. వాళ్లే కాదు తామూ హిందువులమేనంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుతో భాజపా నాయకులు, కార్యకర్తలు జవాబుదారీతనం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. వసూలు చేస్తున్న డబ్బుల లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భాజపా అంటే శ్రీరాముడు... శ్రీరాముడు అంటే భాజపా అన్న చందంగా వారు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇవీచూడండి:

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details