ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్: మంత్రి పెద్దిరెడ్డి - minister peddireddy news

ఆన్‌లైన్​లో ఇసుక మోసాలు అరికట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఏపీఎండీసీ కార్యాలయాల ద్వారా మాత్రమే ఇసుక బుకింగ్ కల్పించే యోచనలో ప్రభుత్వమున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Steps to Prevent Online Scams in Sand Booking
మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Jun 1, 2020, 5:30 PM IST

Updated : Jun 1, 2020, 8:01 PM IST

ఇసుక బుకింగ్​లో ఆన్​లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఏపీఎండీసీ కార్యాలయంలో నూతన ఇసుక పాలసీపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్ పై ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. ఏపీఎండీసీ నుంచి సచివాలయాల ద్వారా వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు. బల్క్ బుకింగ్​లపై కూడా కొత్త నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులకు బుకింగ్​లో వారానికి ఇరవై శాతం డెలివరీ ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ప్రతి రీచ్​కు పది కిలోమీటర్ల పరిధిలోనే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. ఇసుక రవాణా భారం వినియోగదారులపై అధికంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాజమండ్రి నుంచి విశాఖకు ఇసుక రవాణా చెల్లింపులను కి.మీ.కు రూ. 4.90 నుంచి రూ.3.30 కి తగ్గించామని వెల్లడించారు. రానున్న వర్షాకాలం కోసం 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్టు మంత్రి వివరించారు.

జేసీల ద్వారా పరిశీలన

జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ లు ప్రతిరోజూ ఇసుక ఆపరేషన్ పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. జీపీఆర్ఎస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు తిప్పేందుకు వీల్లేదని వెల్లడించారు. పర్యావరణ నిబంధనల ప్రకారమే మైనింగ్ జరగాలని మంత్రి తెలిపారు. ఇసుక రవాణాలో టార్పలిన్‌ కవర్లకు బదులుగా ప్లాస్టిక్ సీళ్లు ఉపయోగించాలన్నారు.

రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్​ల్లో తవ్విన ఇసుకకు, స్టాక్ పాయింట్లలో ఉన్న దానికి మధ్య 2లక్షల మెట్రిక్ టన్నుల తేడా గుర్తించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో సిబ్బంది, రవాణా ఏజెన్సీల పాత్రపై విచారణ చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి కన్నబాబు

Last Updated : Jun 1, 2020, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details