రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణచంద్ర ఆలయంలో ఉట్టి మహోత్సవం నిర్వహించారు. చిన్నారులు గోపబాలుడు, గోపికల వేషధారణలతో అలరించారు. ప్రకాశంజిల్లా చీరాల వీరరాఘవస్వామి దేవాలయంలో... శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణుని కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురంలో వెలసిన శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం నిర్వహించారు. మహిళల కోలాటం, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం గోకులంలా మారింది. విశాఖకు చెందిన భక్తులు... సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. నెల్లూరు ఇస్కాన్ ఆలయంలో లక్ష పూలతో అలంకరణ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్ని గోపాలడుని దర్శించుకున్నారు. ప్రతివాడ, ఇంట కృష్ణుని వేషధారణలలో పిల్లలు ఆకట్టుకున్నారు.