ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వికేంద్రీకరణకు మద్దతుగా.. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు - 3 రాజధానులకు మద్దతుగా విజయనగరంలో ర్యాలీ

ఒక రాజధాని వద్దు.... 3 రాజధానులే ముద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. పలు ప్రాంతాల్లో మానవహారాలు, ర్యాలీలు చేపట్టారు. మూడు రాజధానులకు అంతా మద్దతు ఇవ్వాలంటూ వైకాపా నేతలు పిలుపునిచ్చారు.

state wide many people rally for supporting 3 capital issue
రాష్ట్ర వ్యాప్తంగా 3 రాజధానులే ముద్దంటూ... మద్దతు

By

Published : Feb 6, 2020, 10:18 PM IST

3 రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ... వికేంద్రీకరణకు మద్దతుగా అనేక ప్రాంతాల్లో వైకాపా దీక్షలు నిర్వహించింది. ఒక రాజధాని వద్దు.... 3 రాజధానులే ముద్దంటూ కర్నూలు, అనంతపురంలో మానవహారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి 3 రాజధానులతోనే సాధ్యమవుతుందంటూ... తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో... ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. వికేంద్రీకరణ నిర్ణయం సరైనదేనంటూ... యర్రగొండపాలెంలో ర్యాలీ చేపట్టారు. పాలనా విభజనకు... అన్ని ప్రాంతాల ప్రజలూ మద్దతు తెలపాలని... గన్నవరం వైకాపా నేతలు పిలుపునిచ్చారు. చీపురుపల్లిలో.... మానవహారం చేపట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి.... 3 రాజధానులు అవసరమంటూ.... విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details