కరోనా కట్టడిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొల్లులో సంపుర్ణ లాక్డౌన్ అమలు చేస్తుండగా.. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. లాక్డౌన్ అమలు తీరును ఆమె పరిశీలించారు. 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా నియంత్రణలో భాగంగా మండల టాస్క్ ఫోర్స్ అధికారులు మూడు రోజులుగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టణంలో సంచరిస్తూ దుకాణాలు తెరవకుండా, వాహనదారులు అనవసరంగా రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతరులను రోడ్లపైకి అనుమతించడం లేదు. అత్యవసర ప్రయాణాలు చేస్తూ ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వారికి, నిరాశ్రయులకు, యాచకులకు, ఇంటి వద్ద కరోనా చికిత్స పొందుతున్న వారికి స్నేహహస్తం టీమ్ ద్వారా టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆహారాన్ని అందిస్తున్నారు.