హాథ్రాస్ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు శనివారం కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లా
హాథ్రస్ ఘటనను నిరసిస్తూ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు. దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన దళితులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. హాథ్రస్ ఘటనలో నిందితులనుఉరి తీయాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా
కమలాపురం స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద సీపీఐ, బీఎస్పీ నాయకులు కొవ్వొత్తుల నిరసన చేశారు. హాథ్రాస్ ఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలన్నారు.