ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4 కోట్ల 4 లక్షల 41 వేల 378 ఓటర్లు ఉన్నట్టు తెలిపింది.
మహిళ ఓటర్లు 2 కోట్ల 4 లక్షల 71 వేల 506 మంది ఉండగా.. 1 కోటి 99 లక్షల 66 వేల 737 మంది పురుష ఓటర్లుఉన్నారు.సర్వీసు ఓటర్లు 66 వేల 844 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ధర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మందిగా నమోదయ్యారు. కొత్తగా 4 లక్షల 25 వేల 860 మంది ఓటర్లు 2021 జనవరి నాటికి పెరిగారని.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1500 మంది ఓటర్ల చొప్పున నమోదు అయ్యారనీ.. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 917 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.