ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్‌ఎస్‌సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీం తీర్పునకు విరుద్ధం' - ఎస్‌ఎస్‌సీ కేసుపై హైకోర్టులో విచారణ

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)లో ప్రతిపక్ష నేత పేరు లేదని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ssc case hearing in highcourt
ఎస్‌ఎస్‌సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీం తీర్పునకు విరుద్ధం: హైకోర్టు

By

Published : Oct 14, 2020, 5:46 PM IST

Updated : Oct 14, 2020, 6:42 PM IST

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)లో ప్రతిపక్ష నేత పేరు లేదని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేత పేరు నమోదు చేస్తూ నెల రోజుల్లో జీవో ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఏర్పాటు చేసిన స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ప్రతిపక్ష నేతను సభ్యునిగా నియమించాలని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు పిటీషనర్ తరఫు న్యాయవాది తాండవ యోగేష్.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ లో హోంమంత్రి, సీఎస్, డీజీపీ, ప్రతిపక్ష నేతతో పాటు మరికొందరు ఉంటారని వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ప్రతిపక్ష నేతకు కమిషన్ లో స్థానం లేదని ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయంపై.. గతంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జీవోలో మార్పులు చేసి నాలుగు వారాల్లోగా నూతన జీవో ఇవ్వాలని ఆదేశించింది.

Last Updated : Oct 14, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details