Judicial Service Commission: సమాజ సేవ, న్యాయం కోసం న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ సైన్యంలా పని చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా, మండల న్యాయప్రాధికార సంస్థలు, న్యాయమూర్తులు, చిత్తూరు, తిరుపతి బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పారా లీగల్ అధికారులు, వాలంటీర్లు, న్యాయ విద్యార్థినులు పాల్గొన్నారు.
5 శాతం మందికే చట్టాలపై అవగాహన: జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Judicial Service Commission: కేవలం 5శాతం మందికే చట్టాలపై అవగాహన ఉందని.. మరింత మందికి కల్పించాల్సి ఉందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. సమాజ సేవ, న్యాయం కోసం న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ సైన్యంలా పని చేయాలని పిలుపునిచ్చారు.
కేవలం 5శాతం మందికే చట్టాలపై అవగాహన ఉందని, మరింత మందికి కల్పించాల్సి ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. వరకట్నం అనే మాట ఉండకూడదని, కుటుంబంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమాన గౌరవం ఇవ్వాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తి భీమారావ్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాల్లో 235 లోక్ అదాలత్‌ల ద్వారా రూ.74.40 కోట్ల విలువైన వివాదాలను పరిష్కరించామని తెలిపారు. తిరుపతి కోర్టు మూడో అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ రిశాంత్‌రెడ్డి ప్రసంగించారు. స్టేట్ లీగల్ అథారిటీ సెక్రటరీ భవిత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణ కుమార్, తిరుపతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దినకర్, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: