ఎన్నికలు పూర్తై కొత్తగా ఏర్పాటైన పట్టణ ప్రాంత స్థానిక సంస్థల కౌన్సిల్ తొలి సమావేశాలను నోటిఫై చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది(notifying the first meetings of the Council of Local Bodies news). ఆకివీడు, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, పెనుకొండ నగరపంచాయితీల్లో, కొండపల్లి, కుప్పం మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో కొత్తగా ఏర్పాటై ఎన్నికలు పూర్తైన 10 నగర పంచాయితీలు, మున్సిపాలిటీల్లో మొదటి కౌన్సిల్ సమావేశాన్ని నవంబరు 22 తేదీన నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి నోటిఫికేషన్ ఇచ్చారు.
స్థానిక సంస్థల కౌన్సిల్ తొలి సమావేశాలు.. నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ - ఏపీ వార్తలు
స్థానిక సంస్థల కౌన్సిల్ తొలి సమావేశాలను నోటిఫై చేస్తూ పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. తొలి సమావేశాన్ని నవంబర్ 22వ తేదీన చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
notifying the first meetings of the Council of Local Bodies in ap