Loan app: చట్టవిరుద్ధంగా నడుస్తూ ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న రుణయాప్‌లపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది. ఈ మేరకు ఆర్‌బీఐకు లేఖరాసింది. తెలంగాణలో రుణయాప్‌లపై 2021లో 61 కేసులు, 2022లో 900 కేసులు నమోదైనట్లు వివరించింది. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక గత రెండేళ్లలో ఏడుగురు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలిపింది.
'లోన్‌యాప్స్‌పై చర్యలు తీసుకోండి'.. ఆర్బీఐకి తెలంగాణ ప్రభుత్వం లేఖ
Loan app: లోన్‌యాప్స్‌పై చర్యలు చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్బీఐకి లేఖ రాసింది. యాప్‌లతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన 80 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
213 రుణయాప్‌లు వాటికి అనుబంధంగా ఉన్న 80 ఎన్బీఎఫ్సీలను గుర్తించినట్లు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం 80లో 33 మాత్రమే ఆర్బీఐలో రిజిస్టర్ అయ్యాయని వివరించింది. పలు యాప్‌లు ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని, ఆ సమాచారం కూడా లభించలేదని తెలిపింది. చట్టవిరుద్ధంగా నడుస్తున్న యాప్‌లతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన 80 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకును కోరింది. అనుబంధిత లోన్ యాప్ ల జాబితాను ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీలు ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లోపొందుపర్చాలని, వాటి వివరాలను అప్‌డేట్ చేయాలని తెలంగాణ సర్కారు పేర్కొంది.
ఇదీ చూడండి :కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ చిన్నారి... అక్కడికక్కడే మృతి