ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BOARD MEET: అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం - కేఆర్​ఎంబీ

అత్యవసర సమావేశాల నిర్వహణకే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. సమావేశానికి హాజరయ్యేందుకు వీలుకాదని తెలంగామ రాష్ట్రప్రభుత్వం చెప్పినా సమయాభావం దృష్ట్యా కొనసాగించే ఆలోచనతోనే కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ ఉన్నట్లు సమాచారం. తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

state-govt-has-decided
state-govt-has-decided

By

Published : Aug 7, 2021, 7:05 AM IST

BOARD MEET: అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం

అత్యవసర సమావేశానికి హాజరుపై గోదావరి యాజమాన్య బోర్డుకు ఇచ్చిన సమాధానాన్నే కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం పంపింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ వల్ల.. సోమవారం నాటి సమావేశానికి హాజరుకాలేమని తెలిపింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిని సంప్రదించి వీలైనంత త్వరగా తదుపరి సమావేశం నిర్వహించాలని కోరింది.

రెండు బోర్డులు సిద్ధం

ఐతే రెండు బోర్డులు మాత్రం సమావేశాల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రజలశక్తిశాఖ నిర్దేశించిన గడువు ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం కార్యాచరణ ఖరారు చేయాల్సి ఉందని అందుకే అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సోమవారం బోర్డు సమావేశాలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సుప్రీంను ఆశ్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రానికి న్యాయపరంగా దక్కాల్సిన నీటి వాటా ఖరారుచేయకుండా బోర్డుల పరిధి ఖరారు చేయవద్దని గతంలోనే ప్రభుత్వం పలుమార్లు కోరింది. ఇదే అంశాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గెజిట్ నోటిఫికేషన్‌ షెడ్యూళ్లలోని ప్రాజెక్టులు, అంశాలు, క్లాజులకు సంబంధించిన అభ్యంతరాలు సహా అన్ని అంశాలపై కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ సోమవారం బోర్డుల సమావేశానికి హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడితే అక్కడా అవే అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.


ఇదీ చూడండి:

REGULAERISATION: క్రమబద్ధీకరణకు పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details