ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీలో గవర్నర్.. రాష్ట్రపతితో సమావేశం - state governor tour of delhi today, tomarrow

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

దిల్లీ పర్యనటలో రాష్ట్ర గవర్నర్ హరిభూషణ్

By

Published : Aug 8, 2019, 1:24 PM IST

Updated : Aug 8, 2019, 7:13 PM IST

దిల్లీ పర్యనటలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

దిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హస్తిన పర్యటనకు వెళ్లారు. గవర్నర్ హోదాలో దేశాధ్యక్షుడిని తొలిసారి కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. గవర్నర్ వెంట ఆయన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎ.డి.సి.మాధవరెడ్డి, ఆంధ్రా భవన్ అధికారులు ఉన్నారు. రేపు ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని గవర్నర్‌ హరిచందన్‌ కలవనున్నారు. దిల్లీలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

Last Updated : Aug 8, 2019, 7:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details