ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరంపై సోమవారం కేంద్రానికి నివేదిక - Monday's report on Polavaram

పోలవరంపై ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంపై... కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సమగ్ర సమాచారంతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.

పోలవరంపై సోమవారం నివేదిక

By

Published : Sep 13, 2019, 4:56 AM IST


పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కోరిన నివేదికను ప్రభుత్వం సోమవారం సమర్పించనుంది. ప్రధాన మంత్రి కార్యాలయం సూచన మేరకు ఆ శాఖ వివరణలు కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే జలవనరులశాఖాధికారులు పూర్తి స్థాయి నివేదికను సిద్దం చేశారు. ముసాయిదా ప్రతిపై ఉన్నతస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ఏమైనా మార్పులు చేర్పులుంటే చేసి సోమవారం స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు అందించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details