జ్వరపీడితుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని.. నేటితో పూర్తయ్యే అవకాశముందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 39 వేల మంది జ్వరపీడితులను గుర్తించారని వెల్లడించారు. బాధితులందరికీ ఏఎన్ఎంలు మందులు, ఐసోలేషన్ కిట్లు అందజేస్తారని వివరించారు. ప్రస్తుతం ఏపీలో 522 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని.. ఎక్కడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. వాటి వినియోగంపై జిల్లా అధికారులు ఆడిట్ చేస్తున్నారని వివరించారు. టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించి పలు ఆసుపత్రులపై జరిమానాలు విధించాయని సింఘాల్ చెప్పారు.
ఇదీ చదవండి:కొవిషీల్డ్ రెండో డోసుపై కేంద్రం కీలక ప్రకటన