స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తెదేపా అధినేత చంద్రబాబు వక్రీకరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో... సంక్షేమ పథకాలను అడ్డుకోటానికి యత్నించిన ప్రతిపక్ష తెదేపాను.. ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.
సంక్షేమాన్ని అడ్డుకునేందుకు తెదేపా యత్నం: సామినేని - ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పత్రికా సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెదేపా మద్దతుదారులను తిరస్కరించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సంక్షేమాన్ని అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారు