విదేశీ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. బ్రిటన్‌లో బయటపడిన కొత్త వైరస్ దృష్ట్యా ముందుజాగ్రత్తగా ఆంక్షలు విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అక్కడి నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా
బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇటలీ నుంచి వచ్చేవారిపై నిఘా ఉంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విమానాశ్రయాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై దృష్టి సారించాలని సూచించింది. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, అనంతపురం కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని ఆదేశించింది.