Security Bonds Auctioned : రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సెక్యూరిటీలను వేలం వేసింది. 500 కోట్ల రూపాయల చొప్పున రెండు లాట్లుగా సెక్యూరిటీ బాండ్లను వేలం వేశారు. 6 సంవత్సరాల కాల పరిమితితో వేలం వేసిన సెక్యూరిటీ బాండ్లకు 7.6 శాతం మేర ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది. 2028 నాటికి ఈ సెక్యూరిటీ బాండ్లు పూర్తిగా చెల్లించేలా కాలపరిమితి నిర్దేశించారు. 12 ఏళ్ల కాలపరిమితితో వేలం వేసిన సెక్యూరిటీ బాండ్లకు 7.71 శాతం మేర ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 45,890 కోట్ల రూపాయల రుణాన్ని ప్రభుత్వం తీసుకుంది.
మరోసారి సెక్యూరిటీ బాండ్ల వేలం.. ఈసారి ఎంతంటే..! - సెక్యూరిటీ బాండ్ల వేలం
Security Bonds: సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వ తీసుకోనుంది. ఈ సెక్యూరిటీ బాండ్లను రిజర్వు బ్యాంకు ద్వారా వేలం వేసింది. అయితే ఆరు సంవత్సరాల కాల పరిమితితో వేలం వేసిన ఈ బాండ్లకు 7.6శాతం ప్రభుత్వం వడ్డీ చెల్లించనుంది.
సెక్యూరిటీ బాండ్ల వేలం