ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెగెటివ్ వస్తేనే కుటుంబానికి అప్పగింత.. పాజిటివ్ వస్తే నిబంధనల ప్రకారం అంత్యక్రియలు! - ఏపీ కరోనా మృతుల అంత్యక్రియల వార్తలు

కొవిడ్ అనుమానస్పద మృతుల అంత్యక్రియల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. చనిపోయిన వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించి.. కుటుంబ సభ్యులకు అప్పగించనుంది. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అవకాశం ఉన్నంతవరకు ఎలక్ట్రిక్ పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ తెలిపారు.

state governments instructions to suspicious covid dead bodies
కొవిడ్ అనుమానస్పద మృతుల అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు

By

Published : May 7, 2021, 8:53 PM IST

కరోనా అనుమానాస్పద మృతదేహాల అంత్య క్రియల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సూచనలు చేర్చి ఆదేశాలను జారీ చేసింది. చనిపోయిన వ్యక్తికి కోవిడ్ పరీక్ష నిర్వహించిన అనంతరం నెగటివ్ వస్తే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని రాష్ట్ర కొవిడ్ నోడల్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయితే మృతదేహాన్ని ఖననం చేసేందుకు నిబంధనలు పాటించాలన్నారు. ఆరోగ్య కార్యకర్త పీపీఈ కిట్ ధరించి మృతదేహాన్ని వార్డు నుంచి తొలగించాలని.. లీక్ ప్రూఫ్‌ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్ల్​లో ఉంచాలని తెలిపారు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన వస్త్రాలను మృతదేహానికి చుట్టాలని చెప్పారు. మృతదేహాలకు శవ పరీక్షలు చేయొద్దని వైద్య సిబ్బందికి సూచించారు. మృతదేహాన్ని బ్యాగ్​లో ఉంచి బంధువులకు అప్పగించాలని తెలిపారు. మృతుని బంధువులు మృతదేహానికి స్నానం చేయించడం, ముట్టుకోవడంలాంటి చర్యలు చేయొద్దన్నారు. శ్మశానవాటికలో 20 మందికి మించి బంధువులు ఉండకూడదని స్పష్టం చేశారు. మరణించిన వారి కొవిడ్ నిర్ధారణ ఫలితాలు త్వరగా వచ్చే విధంగా నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details