ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై సిట్ ఏర్పాటు

వైకాపా సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

cm jagan
cm jagan

By

Published : Feb 21, 2020, 10:22 PM IST

Updated : Feb 21, 2020, 10:51 PM IST

గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం(కేబినెట్ సబ్ కమిటీ) సమర్పించిన నివేదికలోని అవినీతి అంశాలపై విచారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటైంది. సిట్ సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అట్టాడ బాపూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, జయరామ్ రాజు, విజయ్ భాస్కర్, గిరిధర్, కెనడీ, శ్రీనివాసన్, ఎస్వీ రాజశేఖర్ రెడ్డి ఉంటారు. సీఆర్డీఏ పరిధిలో అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్, సీఆర్డీఏ సరిహద్దుల మార్పు, బినామీ లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సిట్​కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. సాక్షుల విచారణ మొదలుకుని ఛార్జ్​షీట్ దాఖలు వరకు అధికారాలు కల్పించారు. సీఆర్డీఏ అక్రమాలు సహా ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాలపైనా విచారణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి

Last Updated : Feb 21, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details