కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో 2021 డిసెంబరు 31 వరకు అన్లాక్ నిబంధనలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ పరీక్షలు, కంటైన్మెంట్ జోన్లు, ఇతర నిబంధనల్ని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
'ఈ ఏడాది చివరి వరకు మాస్క్, శానిటైజర్ తప్పనిసరి'
కరోనా వ్యాప్తి కారణంగా 2021 డిసెంబరు 31 తేదీ వరకు కొవిడ్ ప్రోటోకాల్, అన్లాక్ మార్గదర్శకాలు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఆదేశాలిచ్చింది.
కొవిడ్ ప్రోటోకాల్ పొడిగింపు
బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ధరించటం, భౌతిక దూరం పాటించటం, శానిటైజేషన్ తప్పనిసరని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకే విదేశీ ప్రయాణికుల రాకపోకలు ఉంటాయని తేల్చి చెప్పింది. గతంలో జారీ చేసిన కొవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
Last Updated : Jan 1, 2021, 7:23 AM IST