ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు.. హద్దు దాటితే చర్యలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

కరోనా మహమ్మారి ప్రభావంతో నూతన సంవత్సర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించింది. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

new year celebrations
new year celebrations

By

Published : Dec 31, 2020, 8:03 AM IST

కొవిడ్ దృష్ట్యా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను దూరం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు గుమిగూడకుండా పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే సహించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమకు సహకరించాలని ప్రజలను కోరుతున్నారు.

కొత్త రకం కరోనా వ్యాప్తి క్రమంలో వేడుకలను ఇంట్లో జరుపుకోవాలని విజయవాడ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హోటళ్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నిర్ణీత సమయం వరకే ఉంటాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో యధావిధిగా పూజలు, ప్రార్థనలు చేసుకోవచ్చు- బి .శ్రీనివాసులు, విజయవాడ పోలీస్ కమిషనర్

డిసెంబర్ 31న రాత్రి పది గంటల తర్వాత కర్నూలులోని దుకాణాలన్నీ మూసివేయాలి. రోడ్లపై కేకులు కోయడం, బాణసంచా కాల్చడం నిషిద్ధం. ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం- కేవీ మహేష్, కర్నూలు డీఎస్పీ

అనంతపురం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరపడానికి వీల్లేదు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, సైలెన్సర్లు తొలగించి అధిక శబ్ధాలతో ఇతరులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే ఊరుకోం. నేటి రాత్రి పోలీసు యాక్టు అమలులో ఉంటుంది. మైనర్​లకు వాహనాలు ఇవ్వొద్దు- సత్య ఏసుబాబు, అనంతపురం జిల్లా ఎస్పీ

ఇదీ చదవండి:

'న్యాయమూర్తుల బదిలీలతో జగన్​పై కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'

ABOUT THE AUTHOR

...view details