Employees Federation Leaders Meet CM: ప్రభుత్వ విద్యాసంస్థల్లో పని చేస్తోన్న ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వయో పరిమితి పెంపుపై కార్యచరణ ప్రారంభించమని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పేర్కోన్నారు. ముఖ్యమంత్రితో ఏపీపీటీడీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్) వైయస్ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, విశ్వవిద్యాలయ ఉద్యోగులు సమావేశమయ్యారు.
"ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ముఖ్యమంత్రి సానుకూల స్పందన" - ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు
Employees Federation: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెడరేషన్ నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పదించినట్లు వారు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల వైద్య సదుపాయలలో ఉన్న సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అక్టోబర్ 1న పెంచిన వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతులు పొందిన ఆర్టీసీ ఉద్యోగులకూ అక్టోబర్ 1న పెంచిన వేతనాలు అందేలా.. అధికారులను సీఎం ఆదేశించినట్లు పీటీడీ వైఎస్ఆర్ యూనియన్ అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. కారుణ్య నియామకాలను సత్వరమే భర్తి చేసేందుకు సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిపారు. విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు సరిగ్గా అందడం లేదని సీఎంకు తెలియజేయగా.. చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: