ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Salaries Problem: ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు - ఏపీ ప్రభుత్వ లేటెస్ట్​ అప్​డేట్​

salaries unpaid: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇంకా చాలా మందికి జమ కాలేదు. సుమారు లక్ష మందికిపైగా అందలేదని నాయకులు చెబుతున్నారు. మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ సెక్యూరిటీ వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని... వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. మొదట రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని భావించినా... వెయ్యి కోట్లకే పరిమితమైంది.

employees salaries Unpaid
ఏపీ ఉద్యోగులకు జమ కాని జీతాలు

By

Published : Mar 2, 2022, 9:10 AM IST

Salaries unpaid: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు మంగళవారం రాత్రి వరకూ రాలేవు. బిల్లులు సమర్పించి ఖజానా అధికారుల నుంచి సీఎఫ్​ఎంఎస్​కు వెళ్లినా కూడా ఇంకా జీతాలు అందుకోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నిధుల లభ్యత ఆధారంగా కొద్ది మందికి జీతాలు, కొద్దిమందికి పెన్షన్లు మొదటివారంలో ఇస్తూ వస్తున్న క్రమంలోనే ఈ నెల కూడా అదే పంథా కొనసాగుతోందని సమాచారం. జీతాలు, పెన్షన్ల తాజా పరిస్థితి గమనించేందుకు కొందరు వెబ్‌సైట్​లో పరిశీలించగా వారికి చెల్లింపులు 'సక్సెస్' అయినట్లు చూపుతున్నా ఖాతాల్లో మాత్రం జమ కాలేదు. ఇలాంటి వారికి కొద్ది ఆలస్యమైనా ఆయా మొత్తాలు జమ అవుతాయని, బ్యాచ్ మొత్తం ఒకేసారి జమ కాబోవని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

ఏపీ ఉద్యోగులకు జమ కాని జీతాలు

salaries unpaid: జనవరి నెల జీతంతోనే కొత్త పీఆర్సీ అమలు చేసినా... అప్పట్లో ఉద్యోగులు, డీడీవోల సహాయ నిరాకరణ వల్ల పక్కాగా ఆ పని జరగలేదు. ప్రస్తుతం డీడీవోలు, ఖజానా అధికారుల సాయంతోనే బిల్లులు పాస్ చేసే ప్రక్రియ చేపట్టడంతో అసలు కొత్త జీతం ఎంతో స్పష్టంగా ఉద్యోగులందరికీ ఫిబ్రవరి జీతంతో అవగతమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్నవారు దాదాపు 3లక్షల 50 వేల మంది ఉన్నారు. అందులో లక్ష మంది వరకు మంగళవారం రాత్రికి కూడా పెన్షన్ అందలేదని రాష్ట్ర పెన్షన్దారుల అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు.

salaries unpaid: ప్రభుత్వం మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణం స్వీకరించింది. 17 ఏళ్ల కాలపరిమితితో 7.13శాతం వడ్డీతో రుణం తీసుకుంది. నిజానికి రూ.2వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ప్రతిపాదించినా మరో రూ.వెయ్యి కోట్ల రుణ స్వీకరణను తిరస్కరించింది. ఎక్కువ వడ్డీ రేటుతో ఇచ్చేందుకు రుణ దాతలు ముందుకురావడం వల్లే వాయిదా వేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

ys viveka murder case : 'వారిద్దరూ అంటే సీఎం జగన్​కు ఆప్యాయత'

ABOUT THE AUTHOR

...view details