రాష్ట్రంలోని అన్ని పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్లస్థలాల కార్యక్రమం అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. బండిదారి, కాలిదారి, డొంక, బయలు, రోడ్డు పోరంబోకు, కొండ గుట్ట పోరంబోకు, రాతి స్థలం, పాయిఖానా, బంజరు, తాలూక బోర్డు వంటి వివిధ రకాలైన పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పోరంబోకు స్థలాల్లో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పోరంబోకు స్థలాలపై వైకాపా సర్కార్ కీలక నిర్ణయం - ఏపీలో పోరంబోకు స్థలాలు
ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన భూసేకరణకు అవాంతరాలు ఎదురవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేసింది.
![పోరంబోకు స్థలాలపై వైకాపా సర్కార్ కీలక నిర్ణయం cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6273518-38-6273518-1583181604074.jpg)
cm jagan