ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్రోల్, డీజిల్ విక్రయంపై విధిస్తున్న సెస్​ ద్వారా వచ్చే ఆదాయంలో.. 50 శాతాన్ని రహదారుల మరమ్మతులకు వినియోగించాలని నిర్ణయించింది. 7,969 కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తి చేసేందుకు వీలుగా.. రూ. 2,205 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చింది.

government allocations funds for roads repairs
రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Mar 11, 2021, 4:19 PM IST

రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 7,969 కిలోమీటర్ల మేర పనులు చేసేందుకు.. రూ. 2,205 కోట్లు ఖర్చు పెట్టడానికి వీలుగా పాలనా అనుమతులు జారీ అయ్యాయి. 2,726 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల కోసం రూ. 923 కోట్లు.. 5,243 కిలోమీటర్ల మేర జిల్లా రహదారులకు రూ. 1,282 కోట్లతో మరమ్మతులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు ఆదేశాలిచ్చారు.

రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పోరేషన్‌(ఆర్డీసీ) ద్వారా ఈ నిధుల్ని కేటాయించాలని తీర్మానించారు. ఏపీలో పెట్రోలు, డిజీల్‌ విక్రయంపై విధిస్తున్న సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో.. 50 శాతాన్ని రహదారుల మరమ్మతులకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలో వేసి.. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్డీసీ తీసుకున్న రుణంతో.. రహదారులు, భవనాల శాఖ రోడ్ల మరమ్మతులు చేపట్టనుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details