ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం వేసిన పిటిషన్​లో ఇంప్లీడ్ - హైకోర్టు తాజా వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. నేడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.

state employees federation will file an implead petition in the High Court on local body elections
ఎస్​ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు ఉద్యోగుల సంఘాలు.. ప్రభుత్వం వేసిన పిటిషన్​లో ఇంప్లీడ్

By

Published : Jan 11, 2021, 1:00 PM IST

Updated : Jan 11, 2021, 3:02 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన పిటిషన్​లో ఇంప్లీడ్​ కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్​ వెంకట్రామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. వెకేషన్ బెంచ్ ప్రభుత్వ పిటిషన్‌తో కలిసి హైకోర్టు విచారణ చేపట్టనుంది.

ఉద్యోగులు గత 9 నెలలుగా కరోనా నియంత్రణ కోసం కష్టపడ్డారు. ఈ ప్రక్రియలో వందల మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది కరోనా బారినపడ్డారు. అయినా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు కరోనాపై పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చింది. -ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి

కరోనా వ్యాక్సిన్​ను మొదట ఉద్యోగులకు ఇస్తామని ప్రభుత్వం శుభవార్త చెప్పిందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 16 నుంచి మొదలు కానుండటంతో.. ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. మొదట ఒక డోస్​ ఇచ్చిన నెల తర్వాత మరలా రెండో డోస్​ ఇవ్వనుండటంతో.. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం పడుతుంది. అంతవరకు ఎన్నికలు వాయిదా వేయాలని వారు హైకోర్టును కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లపైబడిన వారే కావడంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ ఇచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌కు అనుబంధంగా.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య.. ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సిన్ వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్‌లో ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని కోరాగా.. ఇంప్లీడ్​ పిటిషన్​ను హైకోర్టు అనుమతించింది.

ఇదీ చదవండి:

అప్రమత్తంగా లేకుంటే జేబుకు చిల్లే...!

Last Updated : Jan 11, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details