తెలంగాణలో ఆదివారం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
పోల్ చిట్టీల పంపిణీ పూర్తైనట్లు శశాంక్ గోయల్ వివరించారు. పోలింగ్ రోజు అభ్యర్థికి రెండు వాహనాలకు తోడు... అదనంగా ప్రతి జిల్లాకు మరో వాహనం వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఈసారి దాదాపు 85 శాతం మంది ఎక్కువగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారని... అందరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యస్ఫూర్తిని చాటాలని కోరారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని శశాంక్ గోయల్ విజ్ఞప్తి చేశారు.