కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి మాత్రమే ఈ విధానమంటూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆరు ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో ఒక్కో పేపర్ 50మార్కులకు ఉండగా ఇప్పుడు ఒక్క పేపరే వంద మార్కులకు నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధిని అర్ధగంట పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
పదో తరగతిలో ఆరు ప్రశ్నపత్రాలే? - ssc exams news
కొవిడ్ కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి ప్రశ్నపత్రాల సంఖ్యను ఆరుకు తగ్గించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.
పదో తరగతిలో ఆరు ప్రశ్నపత్రాలే?