రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. దీందో మొత్తం బాధితుల సంఖ్య 8,86,694కు చేరింది. మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7,146కు పెరిగింది. తాజాగా 167 మంది బాధితులు వైరస్ బారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8.78 లక్షలకు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా కేసులు.. నలుగురు మృతి - రాష్ట్రంలో కరోనా వార్తలు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 137 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. కొత్తగా 167 మంది కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరారు.
నలుగురు మృతి
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 48,313 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షలు కోటీ 27 లక్షలు దాటాయని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ భారీ విరాళం