Amaravathi JAC Padayatra: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్ర ఒంగోలుకు చేరుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల దేవస్థానం వరకు కృతజ్ఞతా యాత్ర కొనసాగిస్తామని అన్నారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో బస చేస్తారని పేర్కొన్నారు. ఒంగోలులో శ్రీనివాసరావు పాదయాత్రకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జనసేన నేతలు సంఘీభావం తెలిపారు.
అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని హైకోర్టు తీర్పునకు ముందు నందిగామ అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యులు నందిగామ న్యాయస్థానం నుంచి తిరుమలగిరి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు.