రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ తీసుకొనే సదుపాయం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యలపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఆయన.. అధికారులతో సమీక్షించారు. జిల్లా పాలనాధికారి వినయ్‌చంద్ సహా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, నర్సీపట్నం డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు డివిజన్ల అధికారులు హాజరయ్యారు.
సంతృప్తిగా లబ్ధిదారులు..
రాష్ట్రంలో కోటి 50లక్షల మందికి ప్రతీనెల నిత్యవసర సరకులు అందిస్తున్నామని కమిషనర్‌కు అధికారులు తెలిపారు. సంచార వాహన యూనిట్ల ద్వారా నిత్యవసర సరుకులు తీసుకొనేందుకు.. వాలంటీర్లు ముందు రోజే కూపన్లు పంపిణీ చేసి.. సరకుల సమాచారం అందిస్తున్నారని వివరించారు. సరైన తూకంతో నాణ్యమైన సరకులు అందుతుండటంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.