నాలుగు జిల్లాల్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ స్పష్టం చేశారు. కృష్ణా-గుంటూరు, పశ్చిమ-తూర్పుగోదావరి జిల్లాల పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ప్రతీ మండల కేంద్రంలోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు అయ్యిందని.. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించేలా చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. కృష్ణా- గుంటూరు జిల్లాలకు ఒక ఎన్నికల పరిశీలకుడు, పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాలకు మరో ఎన్నికల పరిశీలకుడ్ని నియమించినట్టు వివరించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి' - teacher mlc elections in ap
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు.
ap mlc elections