రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద ప్రభావిత జిల్లాల్లో(floods in andhraprades) బాధితులను ఆదుకునేందుకు భాజపా ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది. సహాయం చేయడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో పార్టీ శ్రేణులు జోలె పట్టి నిధులు సేకరించాలని(ap bjp collect donations for flood victims) ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ బృందాల ద్వారా బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
AP flood victims: రాష్ట్రవ్యాప్తంగా విరాళాల సేకరణ: భాజపా
వరద బాధితులను ఆదుకోవాలని భాజపా(ap bjp collect donations for flood victims) నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 25, 26 తేదీల్లో జోలె పట్టి నిధులు సేకరించాలని.. వాటిని బాధితులకు పంపిణీ చేయాలని పిలుపునిచ్చింది.
వరదల బీభత్సంతో సీమ జిల్లాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారని సోము వీర్రాజు(somu veerraju on flood victims) ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవటంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు ఉన్న సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్లి జోలె పట్టి వస్తు, నగదు రూపంలో నిధులు సేకరించాలని కోరారు. బాధితులకు పంపిణీ చేసి అండగా నిలవాలన్నారు. ఈ నెల 26న విజయవాడలో తలపెట్టిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా వేస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: