Stars tweets saying thank you CM: ‘థ్యాంక్యూ సీఎం’ , ‘థ్యాంక్యూ వైఎస్ జగన్’ , చిరంజీవి , మహేశ్‌బాబు , ప్రభాస్.. ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌లివి. స్టార్ హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి ట్వీట్‌లు ఇందుకు కారణమయ్యాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న అనేక సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, ఆర్. నారాయణమూర్తి, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయిన సంగతి తెలిసిందే.
Stars Tweets: ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ స్టార్ల ట్వీట్‌లు.. ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు - Prabhas
Stars tweets saying thank you CM:ప్రేక్షకులకు భారం కాకుండా, సినీ పరిశ్రమకు మేలు చేసేలా టికెట్ల ధరలు సవరించామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొనడంతో... ‘థ్యాంక్యూ సీఎం’, ‘థ్యాంక్యూ వైఎస్ జగన్’ అంటూ స్టార్ల ట్వీట్‌లు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేసిన వారు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.
తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేసిన వారు సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు. చిరంజీవి, మహేశ్‌బాబు, రాజమౌళి తదితరులు ట్విటర్‌లో సీఎం, మంత్రి పేర్నినానికి థ్యాంక్స్ చెప్పారు. 'థ్యాంక్యూ వైఎస్ జగన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. సంబంధిత పోస్ట్‌లను అత్యధికమంది నెటిజన్లు లైక్ చేసి.. రీట్వీట్ చేశారు. మరోవైపు, ఒకే ఫ్రేమ్‌లో అగ్ర హీరోలు, దర్శకులు కనిపించటంతో సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను హీరోల పేర్ల హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అలా ‘సీఎంతో సినీ దర్శకనటుల భేటీ’ అంశం ట్రెండ్ అయింది.
ఇదీ చదవండి:సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ: జగన్