ప్రేక్షకుల కేరింతలతో కోలాహలం నెలకొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో సందడిగా మారింది. ఇంతలోనే ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మరికొద్దిసేపట్లో జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభమవుతాయనగా .. ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలి ఆ ప్రాంతమంతా బీతావాహం నెలకొంది.
47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల కోసం వచ్చే ప్రేక్షకుల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 5 వేల మంది కూర్చునేలా సిద్ధం చేశారు. ఒక గ్యాలరీలో సుమారు 1500 మంది ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రేక్షకులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ ప్రాంతంలో అరుపులతో బీతావాహ పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు సూర్యాపేట ప్రభుత్వాస్పత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్యాలరీ కూలడంతో వందల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలప ఉపయోగించి స్టేడియం నిర్మాణం చేశారు.
మంత్రి పరామర్శ..