Student Writes Exam in Ambulance: తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ బకల్వాడ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి అంబులెన్సులోనే పరీక్ష రాశాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి గౌతమ్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆసుపత్రిలో చేరిన అతని కాలుకి వైద్యులు ఆపరేషన్ చేశారు. కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
అంబులెన్స్‌లో ఎగ్జామ్ రాసిన విద్యార్థి... ఏం డెడికేషన్ గురూ! - అంబులెన్స్‌లో పరీక్ష రాసిన విద్యార్థి
Student Writes Exam in Ambulance: పట్టుదల ఉంటే ఎంతటి అవరోధాన్నైనా ఎదురిస్తామంటారు చాలా మంది. ఇష్టం ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులభంగా ఎదురుకుంటామని... అనుకున్నది సాధిస్తామని చెబుతారు. ఈ మాటలకు ఓ విద్యార్థి ఉదాహరణగా నిలిచాడు. డెడికేషన్ అంటే అది అని అనిపించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా... అంబులెన్స్‌లోనే పరీక్ష రాసి ఓ విద్యార్థి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![అంబులెన్స్‌లో ఎగ్జామ్ రాసిన విద్యార్థి... ఏం డెడికేషన్ గురూ! Student Writes Exam in Ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15365662-789-15365662-1653315879763.jpg)
అంబులెన్స్‌లో ఎగ్జామ్ రాసిన విద్యార్థి
సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో పరీక్షలు మానడం ఏమాత్రం ఇష్టం లేని గౌతమ్ అంబులెన్స్‌లోనే పరీక్ష కేంద్రానికి వచ్చాడు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సజ్జాపురం నుంచి పరీక్ష రాయడానికి ఎగ్జామ్ కేంద్రానికి చేరుకున్నాడు. అంబులెన్స్ నుంచి కిందకి దిగలేని పరిస్థితిలో పరీక్ష కేంద్రం నిర్వాహకుల సహకారంతో గౌతమ్ అంబులెన్స్‌లోనే పరీక్ష రాశాడు.
ఇవీ చదవండి: