ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో 'పది' ఫలితాలు విడుదల.. మళ్లీ అమ్మాయిలే టాప్‌ - తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

Tenth results: తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పది ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో అమ్మాయిలు తమ సత్తా చాటారు.

Tenth results
పది ఫలితాలు విడుదల

By

Published : Jun 30, 2022, 3:21 PM IST

Tenth results: తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ప్రభుత్వ వెబ్​సైట్​లో ఫలితాల వివరాలు చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. పది ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో అమ్మాయిలు తమ సత్తా చాటారని హర్షం వ్యక్తం చేశారు.

అమ్మాయిలదే హవా.. పదో తరగతి ఫలితాల్లో బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 3007 పాఠశాలల్లో విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. 15 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.

సిద్దిపేట ఫస్ట్.. పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో నిర్మల్, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచాయి. మే 23 నుంచి జూన్ 1వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు 5, 09, 275 మంది హాజరయ్యారు.

పరీక్షల కంటే ప్రాణం ముఖ్యం.. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడటం వంటి పనులు చేయొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. పరీక్షలు, ఫలితాలు, పాస్, ఫెయిల్ కంటే జీవితం ముఖ్యమని తెలిపారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుని కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చొద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు ఈసారి మరి కాస్త శ్రద్ధ పెట్టి చదివి పాస్ అవ్వాలని సూచించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details